HomePOLITICAL NEWSUncategorizedకాంగ్రెస్ మండల, టౌన్ అధ్యక్షుల నియామకం

కాంగ్రెస్ మండల, టౌన్ అధ్యక్షుల నియామకం

జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, బోధన్ నియోజకవర్గాల్లోని వివిధ మండలాలకు, టౌన్‌లకు కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్‌ కుమార్ గౌడ్ ఉత్తర్వులను జారీ చేశారు. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 25 మండలాలకు, 3 టౌన్‌లకు అధ్యక్షులను నియమించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

స్థానిక ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి (బోధన్), భూపతి రెడ్డి (నిజామాబాద్ రూరల్), నియోజకవర్గ ఇంచార్జీలు వినయ్ రెడ్డి (ఆర్మూర్), సునీల్ రెడ్డి (బాల్కొండ)ల సమన్వయంతో, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్ రెడ్డి ప్రతిపాదనల మేరకు ఈ నియామకాలు చేపట్టారు.

ఈ సందర్భంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ, పార్టీ కోసం కష్టపడుతున్న వారికి పదవులు కట్టబెట్టామన్నారు. నూతన అధ్యక్షులు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

ఆర్మూర్ నియోజకవర్గం:

నాగరాజు రెడ్డి (ఆర్మూర్), దయాకర్ రావు (మాక్లూర్), ప్రమోద్ (ఆలూర్), దూడ వెంకటేష్ (నందిపేట్), బాబు రావు (డొంకేశ్వర్), సాయిబాబా గౌడ్ (ఆర్మూర్ టౌన్).

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం:మంగూరప్ రవి (మోపాల్), కిషన్ నేత (ఇందల్వాయి), మూత జనార్దన్ (నిజామాబాద్ రూరల్), రాథోడ్ అంబర్ సింగ్ (డిచ్‌పల్లి), గాదె నరేష్ (ధర్పల్లి), గడ్డం సంజీవ్ (జక్రాన్‌పల్లి), రొండ్ల గోవర్ధన్ (సిరికొండ).

బోధన్ నియోజకవర్గం:

రవి (సాలూర), నాగేశ్వర్ రావు (బోధన్ మండలం), శ్రీనివాస్ గౌడ్ (నవీపేట్), పులి శ్రీనివాస్ (ఎడపల్లి), దామోదర్ (బోధన్ టౌన్), మొబీన్ (రెంజల్).

బాల్కొండ నియోజకవర్గం: సాట్ల ప్రవీణ్ (బాల్కొండ), మల్లెల లక్ష్మణ్ (భీంగల్), బోనారి భాస్కర్ (కమ్మరపల్లి), శివ కుమార్ (ఎర్గట్ల), బక్కూరి ఆనంద్ (మోర్తాడ్), కొల్వి శ్రీకాంత్ రెడ్డి (ముప్కాల్), రంగు అనిల్ (వేల్పూర్), బడాలా సాయిరెడ్డి (మెండోరా), పర్స అనంత్ రావు (భీంగల్ టౌన్).

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments