సికింద్రాబాద్‌లోప్రముఖ వ్యాపార సముదాయం స్వప్నలోక్ కాంప్లెక్స్ లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. కాంప్లెక్స్ నలుమూలలా దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు, వ్యాపారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు.
ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం… షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా అధికారులు తెలిపారు
