నవీపేట మండల కేంద్రంలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు చీటా ఫోర్స్ పోలీసులు గురువారం దాడులు నిర్వహించారు.
ఈ దాడిలో పేకాట ఆడుతున్న 13 మందిని చీటా ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1,57,000 నగదుతో పాటు 12 సెల్ ఫోన్లు, ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
