సివిల్ వివాదంలో అనవసరంగా జోక్యం చేసుకున్నారనే ఆరోపణలతో మియాపూర్ సీఐ శివప్రసాద్‌పై వేటు పడింది. ఈ మేరకు ఆయనను సైబరాబాద్ సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ కమిషనర్ రమేష్ ఉత్తర్వులు జారీ చేశారు.మియాపూర్ పరిధిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యానికి, ఆ భవన యజమానికి మధ్య కొంతకాలంగా సివిల్ వివాదం నడుస్తోంది.
ఈ వ్యవహారంలో సీఐ శివప్రసాద్ ఏకపక్షంగా వ్యవహరించారని, వివాదంలో తలదూర్చి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి.
దీనిపై ప్రాథమిక విచారణ జరిపిన సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు, ఆరోపణలు నిజమేనని నిర్ధారించుకున్నట్లు సమాచారం. క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే ఆయనను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
