నగరంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎన్ఫోర్స్మెంట్ బృందం అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ వెంకటేష్ తెలిపారు. నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ బృందం నిఘా పెంచింది.
ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారం అందుకున్న అధికారులు, గురువారం రాత్రి సమయంలో నగరంలోని పులాంగ్ చౌరస్తా, బస్టాండ్ పరిసరాల్లో దాడులు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.నిందితుల నుంచి 200 గ్రాముల ఎండు గంజాయిని, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
అరెస్టు చేసిన వారిలో నిజామాబాద్‌కు చెందిన షేక్ సమీర్, పులాంగ్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్ ఉన్నారని తెలిపారు. ఈ దాడుల్లో ఎస్.ఐ. రామ్ కుమార్, సిబ్బంది భూమన్న, విశాల్, లక్ష్మీనర్సయ్య, శివకుమార్, సాయికుమార్, శ్యామ్‌సుందర్, ప్రకాశ్ పాల్గొన్నారు.
