ఉగ్ర వాదుల అనుకూలంగా అన్ లైన్ లో ప్రచారం చేస్తూపట్టుబడిన నిందితుల ఇళ్లలో ఎన్ఐఏ బుధవారం సోదాలు చేపట్టింది. ఏపీ తెలంగాణ ల తో పాటు.. దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఏకకాలంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేసారు .
విజయవాడలోని వించిపేటలో ఉన్న ఒక నిందితుడి ఇంట్లో భారీ భద్రత నడుమ ఈ తనిఖీలు చేపట్టారు. సోదాల్లో ఉగ్రలింకుల కేసుకు సంబంధించి మరిన్ని కీలక ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, బిహార్, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో సోదాలు చేపట్టారు.
ఈ ఏడాది మార్చి నెలలో విజయవాడకు చెందిన మహమ్మద్ రహ్మతుల్లా షరీఫ్, మహమ్మద్ డానిష్, మీర్జా సోహైల్ అనే ముగ్గురు అనుమానితుల్ని టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
వారితో పాటు ఇస్లామిక్ స్టేట్ (ISIS), వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై మరో 9 మంది నిందితుల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
