చదువుకునే వయసులో బాలురతో పని చేయిస్తూ బాలకార్మిక వ్యవస్థను ప్రోత్సహిస్తున్న ఇద్దరు మెకానిక్ షాపు యజమానులను పోలీసులు అరెస్టు చేశారు.
‘ఆపరేషన్ ముస్కాన్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో ఈ అక్రమాలను గుర్తించి చర్యలు తీసుకున్నట్లు నిజామాబాద్ వన్ టౌన్ వన్ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.
ఈ దాడుల్లో మాలపల్లికి చెందిన మెకానిక్ యజమాని సలీమ్ మరియు వీక్లీ మార్కెట్ ప్రాంతానికి చెందిన మెకానిక్ యజమాని సయ్యద్ జమీర్, మైనర్ 10,12 సంవత్సరాల బాలుర చేత పనులు చేయిస్తున్నట్లు గుర్తించారు.
దీంతో బాలకార్మిక చట్టాల ఉల్లంఘన కింద నిందితులు సలీమ్ మరియు సయ్యద్ జమీర్లపై కేసులు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకున్నట్లు రఘుపతి తెలిపారు. చిన్నారుల భవిష్యత్తును దెబ్బతీసేలా ఇలాంటి పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
