జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్…నిజామాబాద్ జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమ నేత సామాజిక కార్యకర్త మీసాల ఫౌండేషన్ అధినేత మీసాల శ్రీనివాసరావు గురువారం రోజున హైదరాబాద్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నివాసంలో జనసేన పార్టీలో చేరారు.
అనంతరం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా మీసాల శ్రీనివాసరావుకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మీసాల శ్రీనివాస్ తమకు 20 సంవత్సరాల అనుబంధం కలదని అదే విధంగా మీసాల ఫౌండేషన్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో సంతోషకరమని అన్నారు.
అనంతరం జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ప్రజలకు చేరువై జనసేన సిద్ధాంతాలను విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
అనంతరం మీసాల ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ జనసేన సిద్ధాంతాలు ప్రజా సేవకు పార్టీ కట్టుబాటు పవన్ కళ్యాణ్ నాయకత్వంపై విశ్వాసంతో చేరినట్లు తెలిపారు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు..
