శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (ఎస్సారెస్పీ) పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్‌లో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఐదుగురు యువకుల్లో నలుగురు నీట మునిగి గల్లంతయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
సమాచారం అందుకున్న వెంటనే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) సాయి చైతన్య అప్రమత్తమయ్యారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్ ప్రాంతంలో ప్రమాదం జరగడానికి దారితీసిన పరిస్థితులపై స్థానికులను, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
గల్లంతైన యువకుల ఆచూకీ కోసం గజఈతగాళ్లు, రెస్క్యూ టీమ్‌ల సహాయంతో పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.సిపి వెంట ఆర్మూర్ ఏసిపి, సీఐ, ఎస్సైలు ఇతర అధికారులు ఉన్నారు.
