అత్తింటీ వేధింపులు తాళలేక వివాహిత ఆత్మ హత్య… అత్తింటీ వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మ హత్య చేసుకున్న ఘటన మోపాల్ మండల కేంద్రము లో చోటు చేసుకుంది. మూపాల్ ఎస్ఐ తెలిపిన వివరాల ఆధారంగా.
వర్షా(40) మండలంలోని కంజర్ గ్రామానికి చెందిన గోవర్దన్ అనే వ్యక్తి తో 13 సంవత్సరాల క్రితం వివాహమైంది. మృతురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అప్పటి నుంచి తరుచుగా ఇరువురి మధ్య గొడవ జరుగుతుండేది.
ఈ క్రమంలో మే 27 నాడు భర్త వేధింపులు భరించలేక వర్షా, వ్యవసాయం నిమిత్త తీసుకొచ్చిన పురుగుల మందు సేవించి అత్మ హత్య యత్నానికి పాల్పడింది.
అది గమనించిన కుటుంబీకులు హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. శుక్రవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీస్ లు తెలిపారు. భర్త పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మెపాల్ ఎస్ఐ తెలిపారు.
