టీఎన్‌జీవోఎస్ యూనియన్ కేంద్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఎన్‌జీవోఎస్ యూనియన్ కేంద్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.ఎం. హుస్సేనీ ముజీబ్‌అన్న ముఖ్య అతిథిగా హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా టీఎన్‌జీవోఎస్ యూనియన్ కేంద్ర అధ్యక్షుడు మారం జగదీశ్వరన్న, కోశాధికారి ఉమాదేవి, టీఎన్‌జీవోఎస్ యూనియన్ ఐటీఐ ఫోరం తెలంగాణ కేంద్ర అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డిని శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు.
టీఎన్‌జీవోఎస్ యూనియన్ హైదరాబాద్ అసోసియేట్ అధ్యక్షుడు కె.ఆర్. రాజ్‌కుమార్, టీఎన్‌జీవోఎస్ యూనియన్ స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం హైదరాబాద్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫెర్రస్ అహ్మద్, ఫోరం జాయింట్ సెక్రటరీ రమేశ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శివ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
కేంద్ర ఉపాధ్యక్షుడు కొండల్‌రెడ్డి, టీఎన్‌జీవోఎస్ యూనియన్ హైదరాబాద్ అధ్యక్షుడు విక్రమ్‌కుమార్, కార్యదర్శి కురాడి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఖలీద్ అహ్మద్, బోలిగడ్డ శంకర్, పబ్లిక్ సెక్రటరీ వైదిక్ శాస్త్ర, ఈసీ సభ్యులు ముకీద్, శ్రీధర్, స్కూల్ ఎడ్యుకేషన్ విభాగానికి చెందిన సతీశ్, కృష్ణ, ప్రేమ్, రవికాంత్, లైబ్రరీ విభాగం మహేందర్, ఎక్సైజ్ విభాగం కుతుబ్బీన్ తదితరులు పాల్గొని మారం జగదీశ్వరన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
