HomePOLITICAL NEWSkamareddyమారుతున్న స్వరం....సీఎం తీరుపై పోచారం గరం గరం...మరోసారి మంత్రుల తీరుపై పోచారం ఫైర్...కొందరు దరిద్రుల వల్లే...

మారుతున్న స్వరం….సీఎం తీరుపై పోచారం గరం గరం…మరోసారి మంత్రుల తీరుపై పోచారం ఫైర్…కొందరు దరిద్రుల వల్లే పార్టీ మారాల్సి వచ్చింది… అభివృద్ధి నిధుల కోసం ఫోన్ చేస్తే మంత్రులు నో రెస్పాన్స్….

సీనియర్ లీడర్ మాజీ స్పీకర్ పోచారం, బాన్స్ వాడ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి మరో సారీ మంత్రుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు. అయన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ ఎదుర్కొలేదన్నట్లు మాట్లాడారు. ఏప్రిల్ 13 న సీఎం రేవంత్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పోచారం మరోసారి మంత్రులు, సీఎం వైఖరిపై మండిపడుతున్నారు పోచారం.

ఇప్పటికే బీఆర్ ఎస్ ను వదిలి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ సైతం పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ లపై పొగడ్తల వర్షం కురిపించారు. ఇటు పోచారం. సైతం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ తన ఫోన్ ఎత్తడం లేదని…. ఎన్ని సార్లు అభివృద్ధి నిధులు అడిగినా లాభం లేకుండా పోయిందంటున్నారు.

తన రాజకీయ అనుభవంలో ఎన్నో పదవులు చేశాను. కానీ ఏనాడు ఈ విధంగా వ్యవహరించలేదు. ఇంతటి అనుభవం ఉన్న నా ఫోన్ కూడా సీఎం రేవంత్, మంత్రులు లిఫ్ట్ చేయటం లేదని… వాపోయారు పోచారం. కొందరు దరిద్రుల వల్లే పార్టీ మారాల్సి వచ్చిందన్నారు పోచారం.

బాన్సువాడ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఆగకూడదని… ప్రతిపక్షంలో ఉంటే నిధులు రావని కేవలం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే పార్టీ మారానంటూ మరోసారి చెప్పారు పోచారం. పోచారం వ్యాఖ్యల వెనుక ఏంటి పొలిటికల్ స్ట్రాటజీ….పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజకీయంలో తలపండిన నేత. ఆయన కామెంట్స్ వెనుక ఏదో ఒక స్ట్రాటజీ తప్పక ఉంటుందంటున్నారు విశ్లేషకులు.

ఇంతటి సీనియర్ లీడర్ ప్రభుత్వంపై ఫైర్ అయితే నిధులు రాబట్టొచ్చన్న వ్యూహం ఉంటుందని కొందరంటుంటే…. మరి కొందరు మంత్రులు, సీఎం రేవంత్ తన పట్ల అనుసరిస్తున్న తీరు పై అసహనం వ్యక్తం చేస్తున్నారని మరో వాదన.

బాన్స్ వాడ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు నిధులు లేక పెండింగ్ లో ఉన్నాయని… ఈ నేపథ్యంలో నిధులు రాబట్టాలన్న ఉద్దేశంతో పోచారం ఘాటుగా స్పందిస్తున్నారని కొందరo టున్నారు. ఏదేమైనా పోచారం లాంటి సీనియర్ నేత ప్రభుత్వ తీరుపై స్పందిస్తున్న విధానం పొలిటికల్ గా సర్కార్ కు కొంత ఇబ్బందికరమే అంటున్నారు.

పోచారం వ్యాఖ్యలు యూటర్న్ కు సoకేతమా….పోచారం మళ్ళీ పాత గూటికి చేరుతారా అన్న టాక్ కూడా పొలిటికల్ సర్కిల్ లో నడుస్తోంది. ఆయన చేస్తున్న కామెంట్స్ చుస్తే కాంగ్రెస్ లో ఇమడటం కష్టమే అన్నట్లు కనిపిస్తోంది.

కనీసం మంత్రులు ఫోన్ కూడా ఎత్తడం లేదు. ఇంతటి అవమానం అవసరమా అన్నట్లు ఫీల్ అవుతున్నారు పోచారం. తాను కాంగ్రెస్ లోకి ఎందుకు చేరాను అన్నది స్పష్టం చేశారు. కానీ అది నెరవేరనప్పుడు పార్టీలో కొనసాగటం. ఎందుకు అన్న ఆలోచనలో కూడా పోచారం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో చేరే సమయంలోనే తాను పెట్టిన శరతులు ఆరు నెలల్లో పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారట. అయితే నిధుల మాట దేవుడెరుగు కనీసం తాను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదంటూ పోచారం వాపోతున్నారు.

ఇలా కామెంట్స్ చేస్తే కనీసం మంత్రుల్లో కదలికైనా వస్తుందనుకుంటున్నా…. ఏప్రిల్ 13న ఇలాగే కామెంట్స్ చేసినా ఇప్పటి వరకు పరిస్థితిలో మార్పు రాలేదు. ఇప్పుడు వస్తుంది అన్న నమ్మకం కూడా లేదనుకుంటున్నారట.

మరి పోచారం యూటర్న్ తీసుకుంటారా అన్న చర్చ కూడా జరుగుతోంది ఆయన వర్గీయల్లో అన్న టాక్ వినిపిస్తోంది. అయితే బీఆర్ ఎస్ వర్గాల్లో మాత్రం పోచారం వ్యవహారం అభివృద్ధి నిధులు రాబట్టటం కోసం ఒక పొలిటికల్ స్టెంట్ గా కొట్టిపారెస్తున్నారు. అయితే పోచారం ఇప్పట్లో పార్టీ మారకపోవచ్చన్న వాదనా… వినిపిస్తోంది. మొత్తానికి ఇదీ సంగతి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments