HomeTelanganaNizamabad25న నిజామాబాద్‌కు గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా..యాంటీ డ్రగ్‌ అవగాహన కార్యక్రమానికి హాజరు

25న నిజామాబాద్‌కు గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా..యాంటీ డ్రగ్‌ అవగాహన కార్యక్రమానికి హాజరు

పసుపు రైతులతో ముఖాముఖి కానున్నారు. తెలంగాణ గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా ఈ నెల 25న నిజామాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు గవర్నర్‌ హౌస్‌ నుంచి అధికారిక టూర్‌ ప్రోగ్రామ్‌ విడుదలైంది.

గవర్నర్‌ హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో నిజామాబాద్‌కు చేరుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 25న ఉదయం 9.15 గంటలకు లోక్‌భవన్‌ నుంచి బయలుదేరి 9.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో నిజామాబాద్‌కు పయనమవుతారు.

10.20 గంటలకు ఐడీఓసీ హెలిప్యాడ్‌కు చేరుకుని అక్కడి నుంచి సుభాష్‌నగర్‌లోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు వెళ్తారు. అనంతరం యెల్లమ్మగుట్టలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించే యాంటీ డ్రగ్‌ అవగాహన కార్యక్రమానికి గవర్నర్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారు.

కార్యక్రమం అనంతరం బోర్గాం ఎఫ్‌సీఐ కాలనీలో డిచ్‌పల్లి–నిజామాబాద్‌ రోడ్డులోని నేషనల్‌ పసుపు బోర్డు కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.15 గంటల నుంచి ఒంటి గంట వరకు పసుపు రైతులతో ముఖాముఖి, మార్కెట్‌ లింకేజీ కార్యక్రమంలో గవర్నర్‌ పాల్గొంటారు.

మధ్యాహ్నం 1.40 గంటలకు నేషనల్‌ పసుపు బోర్డు నుంచి బర్దిపూర్‌ ధర్మారం సమీపంలోని పీహెచ్‌ఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు బయలుదేరి 1.50 గంటలకు అక్కడికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1.50 నుంచి 2.50 గంటల వరకు అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

ఈ కార్యక్రమాన్ని అరవింద్‌ ధర్మపురి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పీహెచ్‌ఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ నుంచి ఐడీఓసీ హెలిప్యాడ్‌కు బయలుదేరి 3.15 గంటలకు అక్కడికి చేరుకుంటారు. 3.20 గంటలకు హెలికాప్టర్‌లో బేగంపేటకు బయలుదేరి సాయంత్రం 4.20 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటారు.

గవర్నర్‌ పర్యటన నేపథ్యంలో ముందస్తు పోలీసు బృందం ఈ నెల 24వ తేదీ సాయంత్రం రోడ్డు మార్గంలో నిజామాబాద్‌కు చేరుకోనుంది. ఎనిమిది మందితో కూడిన అడ్వాన్స్‌ పోలీసు బృందానికి జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో వసతి సౌకర్యాలు కల్పించనున్నారు.

గవర్నర్‌తో పాటు లోక్‌భవన్‌కు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏడీసీ, సీఎస్‌వో, పీఎస్‌ తదితర అధికారులు హెలికాప్టర్‌లో పర్యటించనున్నారు.గవర్నర్‌ పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ హెలిప్యాడ్లు, కార్యక్రమ వేదికల వద్ద భద్రతా ఏర్పాట్లు, వాహనాల రాకపోకలు, వైద్య సదుపాయాలు తదితర అంశాలపై అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments