HomeTelanganaNizamabadఆధార్‌ ఆథెంటికేషన్‌తో పోలీస్‌ అభ్యర్థులకు తిప్పలు చివరి దశలో ఫేస్‌ ఆథెంటికేషన్‌..

ఆధార్‌ ఆథెంటికేషన్‌తో పోలీస్‌ అభ్యర్థులకు తిప్పలు చివరి దశలో ఫేస్‌ ఆథెంటికేషన్‌..

సర్వర్‌ సమస్యలతో అవస్థలుపోలీస్‌ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియలో ఆధార్‌ ఆథెంటికేషన్‌ అభ్యర్థులకు తిప్పలు తెచ్చిపెడుతోంది. తొలుత ఆధార్‌ యాప్‌ ద్వారా ఆథెంటికేషన్‌ పూర్తి చేసినప్పటికీ.. దరఖాస్తు చివరి దశలో మరోసారి ఫేస్‌ ఆథెంటికేషన్‌ చేయాల్సి రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఫేస్‌ ఆథెంటికేషన్‌ పూర్తయిన తర్వాత ఆధార్‌ సర్వర్‌ స్పందించకపోవడం, సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దరఖాస్తు ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోతోందని అభ్యర్థులు వాపోతున్నారు. ముఖ్యంగా ఆధార్‌ కార్డులో వివరాలను అప్‌డేట్‌ చేసుకోని వారికి సమస్యలు మరింతగా ఎదురవుతున్నాయని చెబుతున్నారు.

గతంలో ఓటీపీ ఆధారిత ఆథెంటికేషన్‌తో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేదని అభ్యర్థులు గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం బయోమెట్రిక్‌, ఫేస్‌ ఆథెంటికేషన్‌ వంటి విధానాలతో సాంకేతిక సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు.

దరఖాస్తుదారులకు ఇబ్బందులు కలగకుండా ఓటీపీ ఆధారిత ఆథెంటికేషన్‌ను కొనసాగించడంతోపాటు ప్రత్యామ్నాయ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments