HomeCRIMEఅమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నిజామాబాద్ నగర యువకుడు మృతి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నిజామాబాద్ నగర యువకుడు మృతి

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్‌ జిల్లా కు చెందిన యువకుడు మృతి చెందాడు. నిజామాబాద్ నగరంలోని గూపన్ పల్లి లో వుండే రాహుల్ స్వగ్రామం నవీపేట్‌ మండలం నాడాపూర్ చదువుల కోసం వారు నిజామాబాద్ నగరానికి వచ్చారు.ఇంజనీరింగ్ పూర్తీ చేసిన రాహుల్ మూడు నెలల క్రితమే అమెరికాకు వెళ్లినట్లు తెలిసింది.

ఉన్నత చదువులు లేదా ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన కొద్దికాలానికే రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కుమారుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

రాహుల్‌తో పాటు మరో ఇద్దరు యువకులు కూడా మృతిచెందినట్లు సమాచారం. ఫ్లోరిడాలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాహుల్‌ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments