బాల్కొండ మండల కేంద్రంలో బుధవారం రోజు వన్నెల.బి వరద కాలువ గట్టు పైన కొంతమంది చేరి గంజాయి తాగుతున్నారనే సమాచారం ప్రకారం బాల్కొండ పోలీసు వారు అక్కడికి వెళ్లి అక్కడ 18 మంది గంజాయి తాగుతూ పట్టుబడగా ఒకరు వారికి గంజాయి విక్రయించేందుకు రాగా వారందరినీ పట్టుకొని విచారించగా ఒక వ్యక్తి వద్ద 40 గ్రాముల ఎండు గంజాయి మరియు చిన్న జిప్ లాక్ కవర్లకి సంబంధించిన ప్యాకెట్ ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది, మరియు 18 మంది గంజాయి తాగే వారిని పట్టుకోవడం జరిగింది.
ఆలాగే బాల్కొండ లోని మల్లన్న గుట్ట దగ్గర గంజాయి తాగుతున్న బాల్కొండ పోలీసు వారు అక్కడికి చేరుకోని అక్కడ గంజాయి తాగుతున్న 13 మందిని పట్టుకొన్నారు, వారిని 31 మందిని డి అడిక్షన్ సెంటర్ లకు పంపడం జరిగిందని ఎస్సై శైలేందర్ తెలిపారు, గంజాయి విక్రయించే వ్యక్తిని రిమాండ్ తరలించి గంజాయి కి బానిస అయినటువంటి మిగతా వారిని డి అడిక్షన్ సెంటర్లకు పంపడం జరిగింది,వీరందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాల్కొండ ఎస్సై శైలేందర్ తెలిపారు.
