HomeDevotionalమాల్‌పూరీ నైవేద్యంతో లంబాడాల కృష్ణాష్టమి.. ప్రత్యేక సంప్రదాయాలు..

మాల్‌పూరీ నైవేద్యంతో లంబాడాల కృష్ణాష్టమి.. ప్రత్యేక సంప్రదాయాలు..

కామారెడ్డి జిల్లాలోని గాంధారి, పెద్దకొడపల్‌ మండలాల్లోని మథుర లబానా, లంబాడాల్లో కృష్ణాష్టమి సందడి మొదలవుతుంది. సంప్రదాయ దుస్తులు ధరించి, ఇంటిల్లిపాదీ కలిసి మట్టితో స్వయంగా శ్రీకృష్ణుడి ప్రతిమలను తయారు చేసి పూజించడం ఇక్కడి ప్రత్యేకత. పండుగ సందర్భంగా చేలల్లోని మట్టిని తీసుకువచ్చి, బావి నీటితో కలిపి ప్రతిమలను తయారు చేస్తారు.

తయారుచేసిన మట్టి కృష్ణుడి ప్రతిమలకు ప్రత్యేక పూజలు నిర్వహించి.. సంప్రదాయ పద్ధతిలో ‘మాల్‌పూరీ’ తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. గ్రామంలోని అన్ని కుటుంబ సభ్యులు భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొంటారు.

తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని నేటి తరం కూడా కొనసాగిస్తూ కృష్ణాష్టమిని వైభవంగా జరుపుకొంటోంది. కృష్ణాష్టమి మరుసటి రోజు మట్టి ప్రతిమలను ఊరేగింపుగా తీసుకెళ్లి సమీపంలోని చెరువుల్లో నిమజ్జనం చేస్తారు.

దీంతో రెండు రోజులపాటు కొనసాగిన వేడుకలు సంప్రదాయబద్ధంగా ముగుస్తాయి. ఆధునికత పెరుగుతున్నా.. తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలను కాపాడుకుంటూ ఈ ప్రాంత ప్రజలు జరుపుకొనే కృష్ణాష్టమి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments