HomeTelanganaHyderabadఆర్టీసీ లో మోగిన ఎన్నికల నగారా .........షెడ్యూల్ విడుదల

ఆర్టీసీ లో మోగిన ఎన్నికల నగారా ………షెడ్యూల్ విడుదల

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో ఎన్నికల నగారామోగింది. యూనియన్ గుర్తింపు ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాయి.

సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించనున్నారు , హైదరాబాద్ జాయింట్ లేబర్ కమిషనర్ శుక్రవారం ఈ ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించారు. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 9వ తేదీన పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 17న ఓట్ల లెక్కింపు పూర్తి చేసే ఫలితాలను వెల్లడిస్తారు.

*సెప్టెంబర్ 22 (మంగళవారం): ఆయా డిపో మేనేజర్లు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను సంబంధిత జిల్లాల డిప్యూటీ రిటర్నింగ్ అధికారులకు (DCLs) అందజేయడం, యూనియన్ల నుంచి అభ్యంతరాలు కోరడం.

*సెప్టెంబర్ 24 (గురువారం): ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు ఆఖరి తేదీ.

*సెప్టెంబర్ 25 సంబంధిత డిపో మేనేజర్లు/యూనిట్ అధికారులతో చర్చించి అభ్యంతరాలను పరిష్కరించి తుది రూపు ఇవ్వడం.

*సెప్టెంబర్ 26 :పోటీ చేసే యూనియన్లకు తుది ఓటర్ల జాబితా పంపిణీ, పోటీలో ఉండే యూనియన్లకు గుర్తుల కేటాయింపు, జిల్లాల డీసీఎల్లు తుది ఓటర్ల జాబితాను ప్రధాన రిటర్నింగ్ అధికారికి సమర్పించడం.

*సెప్టెంబర్ 29 :పోటీ చేసే యూనియన్లు నమూనా బ్యాలెట్ పత్రాలను (Dummy Ballot Papers) డీసీఎల్ వద్ద నుంచి సేకరించడం.

|\\అక్టోబర్ 09 పోలింగ్ తేదీ (ఉదయం 5:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు).\\__
\\అక్టోబర్ 14 & 15: పోస్టల్ బ్యాలెట్ నిర్వహణ.\\

\\\అక్టోబర్ 17 (శనివారం): ఫలితాల ప్రకటన.\\

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments