HomeCRIMEరైలులో 26.3 కిలోలు గంజాయి పట్టివేత

రైలులో 26.3 కిలోలు గంజాయి పట్టివేత

రైలులో అక్రమంగా తరలిస్తున్న 26.3 కిలోల ఎండు గంజాయి నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పట్టుబడింది. రైలు నంబర్‌ 20811 ఎక్స్‌ప్రెస్‌లో ఆర్పీఎఫ్‌ సిబ్బంది తనిఖీలు నిర్వహించగా జనరల్‌ కోచ్‌లో సీటు కింద కార్టన్‌ బాక్సులో దాచిన 12 ప్యాకెట్ల గంజాయి లభించింది.

దీని విలువ సుమారు రూ.13.15 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆర్పీఎఫ్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఐపీఎఫ్‌ ఎస్‌.కల్పన పర్యవేక్షణలో ఎస్‌ఐపీఎఫ్‌ పి.హరిబాబు, హెడ్‌ కానిస్టేబుళ్లు కలిసి రైలు నంబర్‌ 20811 ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు చేపట్టారు.

రైలు వెనుక భాగంలోని జనరల్‌ కోచ్‌లో తనిఖీలు చేస్తుండగా ఓ సీటు కింద కార్టన్‌ బాక్స్‌ కనిపించింది. దానిని పరిశీలించగా 12 ప్యాకెట్లలో ఎండు గంజాయి ఉన్నట్లు గుర్తించారు. తూకం వేయగా మొత్తం 26.3 కిలోలు ఉన్నట్లు తేలింది.గంజాయిని స్వాధీనం చేసుకున్న ఆర్పీఎఫ్‌ సిబ్బంది తమ పోస్ట్‌కు తరలించారు.

అనంతరం తదుపరి చట్టపరమైన చర్యల కోసం ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారులకు అప్పగించారు. ఈ ఘటనపై నిజామాబాద్‌ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ పోలీసులు ఈసీఆర్‌ నంబర్‌ 232/2026 నమోదు చేశారు. ఎన్‌డీపీఎస్‌ చట్టంలోని సెక్షన్‌ 8(సి) రెడ్‌విత్‌ 20(బి)(ii)(సి) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గంజాయి ఎక్కడి నుంచి రైలులోకి తీసుకొచ్చారు ఎక్కడికి తరలిస్తున్నారు? అనే వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

రైలులో 26.3 కిలోలు గంజాయి పట్టివేత రైలులో అక్రమంగా తరలిస్తున్న 26.3 కిలోల ఎండు గంజాయి నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పట్టుబడింది. రైలు నంబర్‌ 20811 ఎక్స్‌ప్రెస్‌లో ఆర్పీఎఫ్‌ సిబ్బంది తనిఖీలు నిర్వహించగా జనరల్‌ కోచ్‌లో సీటు కింద కార్టన్‌ బాక్సులో దాచిన 12 ప్యాకెట్ల గంజాయి లభించింది.

దీని విలువ సుమారు రూ.13.15 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆర్పీఎఫ్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఐపీఎఫ్‌ ఎస్‌.కల్పన పర్యవేక్షణలో ఎస్‌ఐపీఎఫ్‌ పి.హరిబాబు, హెడ్‌ కానిస్టేబుళ్లు కలిసి రైలు నంబర్‌ 20811 ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు చేపట్టారు.

రైలు వెనుక భాగంలోని జనరల్‌ కోచ్‌లో తనిఖీలు చేస్తుండగా ఓ సీటు కింద కార్టన్‌ బాక్స్‌ కనిపించింది. దానిని పరిశీలించగా 12 ప్యాకెట్లలో ఎండు గంజాయి ఉన్నట్లు గుర్తించారు. తూకం వేయగా మొత్తం 26.3 కిలోలు ఉన్నట్లు తేలింది.గంజాయిని స్వాధీనం చేసుకున్న ఆర్పీఎఫ్‌ సిబ్బంది తమ పోస్ట్‌కు తరలించారు.

అనంతరం తదుపరి చట్టపరమైన చర్యల కోసం ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారులకు అప్పగించారు. ఈ ఘటనపై నిజామాబాద్‌ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ పోలీసులు ఈసీఆర్‌ నంబర్‌ 232/2026 నమోదు చేశారు.

ఎన్‌డీపీఎస్‌ చట్టంలోని సెక్షన్‌ 8(సి) రెడ్‌విత్‌ 20(బి)(ii)(సి) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గంజాయి ఎక్కడి నుంచి రైలులోకి తీసుకొచ్చారు ఎక్కడికి తరలిస్తున్నారు? అనే వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments