HomeDevotionalగణేశ్‌ నిమజ్జనానికి భారీ బందోబస్తు20 వేల మంది పోలీసులతో పహారా.. 10 వేల సీసీ కెమెరాలు,...

గణేశ్‌ నిమజ్జనానికి భారీ బందోబస్తు20 వేల మంది పోలీసులతో పహారా.. 10 వేల సీసీ కెమెరాలు, 24 డ్రోన్లతో నిఘా

బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌సాగర్‌ వరకు ప్రత్యేక ఏర్పాట్లు గణేశ్‌ నిమజ్జన మహోత్సవానికి హైదరాబాద్‌ సిటీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 25న జరిగే తుది శోభాయాత్రకు 20 వేల మంది పోలీసు సిబ్బందిని రంగంలోకి దింపుతున్నారు. బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌సాగర్‌ వరకు ప్రధాన మార్గాల్లో 10 వేల సీసీ కెమెరాలు, 24 డ్రోన్లతో నిఘా పెట్టనున్నారు.

మరో 100 వరకు హైరైజ్‌ కెమెరాలతో విగ్రహాల రాకను పర్యవేక్షిస్తారు. ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ను ఇప్పటివరకు 25 లక్షల మంది, బాలాపూర్‌ గణేశ్‌ను 15 లక్షల మంది దర్శించుకున్నారు. చివరి రోజు రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇతర జిల్లాల నుంచి 8,142 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని 42 ప్లాటూన్లుగా రప్పించి ఏడు జోన్లకు కేటాయించారు.

నాలుగు ఆర్‌ఏఎఫ్‌, రెండు సీఆర్‌పీఎఫ్‌ కంపెనీలను సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించారు. 53 బీడీ బృందాలు విధుల్లో ఉంటాయి. మొజంజాహి మార్కెట్‌, బషీర్‌బాగ్‌ తదితర ప్రాంతాల్లో ఐజీ, డీఐజీ స్థాయి అధికారులను నియమించారు.ఇప్పటికే వివిధ ప్రాంతాలకు చెందిన 32,878 విగ్రహాల నిమజ్జనం పూర్తికాగా, గత 24 గంటల్లోనే 2,161 విగ్రహాలు నిమజ్జనమయ్యాయి.

హైదరాబాద్ పరిధిలో మండపాల అనుమతులకు 15,426 దరఖాస్తులు రాగా, పరిశీలన అనంతరం 14,929 మండపాలకు అనుమతులు ఇచ్చారు.అనుమతులన్నింటినీ జియోట్యాగింగ్‌ చేశారు. బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌సాగర్‌ వరకు రూట్‌ తనిఖీలు పూర్తి చేసి రోడ్ల మరమ్మతులు, విద్యుత్‌ తీగల తొలగింపు, చెట్ల కొమ్మల కత్తిరింపు చేపట్టారు.

డీజేలు, సౌండ్‌ మిక్సర్లు, అధిక శబ్ద పరికరాలు, బాణసంచా వినియోగంపై నిషేధం అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పరికరాలు స్వాధీనం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళల భద్రత కోసం మూడు షిఫ్టుల్లో 26 షీ-టీమ్స్‌ పనిచేస్తాయి.

సెప్టెంబరు 14 నుంచి ఇప్పటివరకు రద్దీ ప్రాంతాల్లో అసభ్యంగా ప్రవర్తించిన 1,172 మందిని పట్టుకున్నారు. నేర నియంత్రణకు 25 ప్రత్యేక మఫ్టీ బృందాలను ఏర్పాటు చేశారు.సమన్వయంతో ముందుకుజలాశయాల వద్ద గజ ఈతగాళ్లు, రెస్క్యూ బోట్లు, అంబులెన్సులు, అగ్నిమాపక శకటాలు సిద్ధంగా ఉంచారు.

ప్రధాన కూడళ్ల వద్ద మెకానిక్‌లు, అదనపు డ్రైవర్లను అందుబాటులో ఉంచారు. నిమజ్జన రూట్లను ముందుగానే పరిశీలించి అనుభవజ్ఞులైన డ్రైవర్లను నియమించుకోవాలని నిర్వాహకులకు సీపీ వీసీ సజ్జనర్‌ సూచించారు.

ప్రజలు సంయమనం పాటించి పోలీసులకు సహకరించాలని, సోషల్‌ మీడియాలో పుకార్లు, విద్వేషపూరిత పోస్టులు చేయవద్దని కోరారు. కేటాయించిన జలాశయాల్లోనే నిమజ్జనం చేయాలని సూచించారు. ట్రాఫిక్‌ పోలీసులు జారీ చేసే సూచనలను పాటించాలని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments