వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ భారీ ఎత్తున సంస్థాగత ప్రక్షళన కు సిద్ధం అయింది. సుదీర్ఘ కసరత్తుల నేపథ్యంలో సామజిక సామాజిక సమతుల్యం తో ఆయా రాష్ట్రాలకు కొత్త ఇంచార్జ్ లను నియమించింది.
ముఖ్యంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ లో అధికారం కోసం పావులు కదుపుతున్న బీజేపీ అందుకు తగ్గట్లుగా నే యూపీ లో బీజేపీ అధికారంలోకి రావడంలో క్రియాశీల పాత్ర పోషించిన సునీల్ బన్సల్, కు తెలంగాణ బాధ్యతలు అప్పగించింది గతంలోనూ ఆయన కొంత కాలం తెలంగాణ లో పనిచేసిన అనుభవం ఉంది.
సంస్థాగత వ్యవహారాల్లో బన్సల్ అత్యంత కఠిన గా వుంటారనే వాదన ఉంది అందులోను తెలంగాణ నేతల్లో ఏ మాత్రం ఐక్యత లేదు అదే పార్టీ బలోపేతానికి శరాఘాతం అవుతుంది. బన్సల్ ను రంగంలోకి దింపడం ద్వారా అధిష్టానం రాబోయే రోజుల్లో తెలంగాణ మీద గట్టిగానే ఫోకస్ చేయబోతోందని పార్టీ వర్గాల్లో ప్రచారం మొదలయింది. బన్సల్ కు తోడుగా సహ ఇన్చార్జులుగా రేఖ శర్మ, అభయ్ పాటిల్ లను నియమించారు.
అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ఇంచార్జిగా అరవింద్ భదౌరియా, వనతీ శ్రీనివాసన్ లను నియమించారు. మరో వైపు తెలుగురాష్ట్రాలకు చెందిన సీనియర్ నేతలకు ఆయా రాష్ట్రాల కు బీజేపీ కొత్తగా చేపట్టిన నియామకాల్లో అవకాశాలు దక్కాయి.
అందులో సీనియర్ నేత రామ్ మాధవ్ తమిళనాడు బీజేపీ ఇంచార్జ్ గా నియమితులయ్యారు. సహ ఇంచార్జ్ గా ఎంపీ డీకే అరుణకు అవకాశం కల్పించారు. ఇక ఒడిశా ఇంఛార్జిగా పురందేశ్వరి, కర్ణాటక సహా ఇంచార్జీ గా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు ను అధిష్టానం నియమించింది.
