HomeDevotionalఅంగరంగ వైభవంగా సేవా గణపతి నిమజ్జన శోభాయాత్ర

అంగరంగ వైభవంగా సేవా గణపతి నిమజ్జన శోభాయాత్ర

భక్తి, సేవ, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా కొలువుదీరిన సేవా గణపతికి నిమజ్జన శోభాయాత్రను బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న గణనాథుడిని భక్తిశ్రద్ధలతో శోభాయాత్రగా బాసర గోదావరి నదీ ఘనంగా నిమజ్జనం చేశారు.

ఇందూరు యువత కార్యాలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర సన్నాయి మేళం, మంగళవాయిద్యాల నడుమ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సుమంగళులు మంగళహారతులతో గణనాథుడికి స్వాగతం పలుకుతూ శోభాయాత్రలో పాల్గొనగా, మార్గమంతా భక్తి వాతావరణం నెలకొంది.

సేవా భావంతో ప్రతిష్ఠించిన గణనాథుడికి పూజలు, భక్తుల ఆధ్యాత్మిక భావోద్వేగాల నడుమ ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు రామగిరి సుధాకర్, శ్రీకాంత్, దత్తు, సాయి తేజ, ప్రమోద్, మనోహర్, ఖరన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments