HomeCRIMEగణేశ్‌ శోభాయాత్ర ప్రారంభంలో రగడజెండా ఊపే విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌ నేతల మధ్య నువ్వా.. నేనా!

గణేశ్‌ శోభాయాత్ర ప్రారంభంలో రగడజెండా ఊపే విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌ నేతల మధ్య నువ్వా.. నేనా!

నగరంలో గణేశ్‌ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభోత్సవం రాజకీయ రగడకు వేదికైంది. సార్వజనిక్‌ గణేశ్‌ మండలి ఆధ్వర్యంలో ప్రతి ఏటా దుబ్బ చౌరస్తా నుంచి ప్రారంభమయ్యే నిమజ్జన రథయాత్రకు ఈసారి బీజేపీ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ హాజరయ్యారు.

రథయాత్రను జెండా ఊపి ప్రారంభించే సమయంలో ఇరువర్గాల నేతల మధ్య ఆధిపత్య పోరు నెలకొనడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఎప్పటిలాగే సార్వజనిక్‌ కమిటీ ప్రతినిధులు జెండా ఊపి రథయాత్రను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఒకే సమయంలో ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ జెండా ఊపేందుకు ముందుకు రావడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది.

జెండా ఎవరు ఊపాలన్న విషయంలో ‘నువ్వా.. నేనా’ అన్నట్లుగా ఇరువర్గాల మధ్య పోటీ నెలకొంది.ఇరువర్గాల నాయకులు జెండాను పట్టుకునేందుకు ప్రయత్నించడంతో అక్కడున్న కార్యకర్తల్లోనూ ఉత్కంఠ నెలకొంది.

కొద్దిసేపు జెండా కోసం పీకులాట జరగడంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. చివరకు రథయాత్ర ప్రారంభమై ముందుకు సాగింది. వినాయకుడి రథం కదలాల్సిన వేళ.. రాజకీయ రగడ తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments