కాసుల కక్కర్తి తో ఒకరిద్దరు అధికారుల నిర్వాహకం తో నిజామాబాద్ నగర పోలీస్ ప్రతిష్ఠ మసక బారుతుంది.
అనుమానాస్పద మృతి ఘటన లో ఏ సంబంధం లేని ఓ కేసులో ఇరికిస్తానంటూ ఏ ఎస్సై చిరు వ్యాపారి ని డబ్బుల కోసం దబాయిస్తున్న వైనం ఒకటి వెలుగు చూసింది. . శనివారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మద్యం సేవించి నిజామాబాద్ పెద్దబజర్ నుంచి వెళ్తుండగా అదుపు తప్పి పక్కనే ఉన్న ఓ మురికి కాలువలో పడి మృతి చెందారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునీ మృతదేహన్ని పోస్టు మార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆ మృతదేహం నగరంలోని ఓ బ్యాండ్ దుకాణం ముందు పడి ఉన్నందున ఆ పరిధి ఠాణా కు చెందిన ఓ ఏఎస్ఐ అధికారి బ్యాండ్ యజమానికి ఫోన్ చేశారు. ఉన్నఫలంగా టౌన్ కు రావాలంటూ ఏఎస్ఐ కబురు పెట్టాడు.
దీంతో షాక్ తిన్న ఆ వక్తి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. నీ షాపు ముందే వ్యక్తి చనిపోయాడు కదా సంగతి ఏందీ అంటూ నేరుగా కాసులు బేరం మొదలుపెట్టారు.
ఆ వ్యక్తి నీ షాపు ముందు పడి నీకేసు నమోదు కాకుండా చూస్తామని అందుకు ప్రతిఫలంగా 5 వేల రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసాడు నేను ఎందుకు ఇవ్వాలి అంటూ ఆ యువకుడు తిరగబడ్డాడు.
దీనితో కంగు తిన్న ఏ ఎస్సై నీవు డబ్బులు ఇవ్వకుంటే నీ షాపు నా పరిధిలోనే ఉంది.నీవు ఎక్కడ బ్యాండ్ ప్రోగ్రాం చేసినా నే బ్యాండ్ తీసుకొచ్చి స్టేషన్ లో కుర్చోబెడుతనని వార్నింగ్ ఇచ్చాడు.దీంతో సదరు ఆ వ్యక్తి ఏం చేయాలో అర్థం కాక నిస్సహాయ స్థితిలో ఉన్నాడు.
