నిజామాబాద్ నగరంలో రెడ్‌క్రాస్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు హరిచరణ్ మార్వాడి పాఠశాలలో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి, డీసీవో శ్రీనివాసరావు తెలిపారు.
ఎన్నికల కోసం 13 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, బ్యాలెట్లతో సహా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. రెడ్‌క్రాస్ ఎన్నికల్లో మొత్తం 9,826 మంది సభ్యులు ఓటర్లుగా ఉన్నారు. రెండు ప్యానళ్ల నుంచి మొత్తం 29 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు, సిబ్బందికి అవసరమైన ఆదేశాలు జారీ చేసి పర్యవేక్షణ ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు.ఓటు హక్కు వినియోగించుకునే సభ్యులు తప్పనిసరిగా రెడ్‌క్రాస్ గుర్తింపు కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలని సూచించారు.
పోలింగ్ కేంద్రం లోపలికి సెల్ఫోన్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు.
