వికారాబాద్ జిల్లా అనంతగిరి వద్ద ఘాట్ రోడ్డు లో వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయ లో పడింది ఈ దుర్ఘటన లో ముగ్గురు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కేసారం నుంచి చింత కుంట కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది .
వికారాబాద్ మండలం కేసారం నుంచి దారూర్ మండలం చింతకుంటకు అంత్యక్రియల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అనంతగిరి ఘాట్ రోడ్డులో బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
