సనత్‌నగర్ టిమ్స్ సందర్శనకు వెళ్తున్నారన్న సమాచారంతో ఇంటి వద్ద పోలీసుల మోహరింపుహైదరాబాద్, జూబ్లీహిల్స్ డివిజన్: జూబ్లీహిల్స్ డివిజన్ మాజీ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్‌ను పోలీసులు శుక్రవారం హౌస్ అరెస్ట్ చేశారు.
సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆసుపత్రిని సందర్శించేందుకు ఆయన వెళ్లనున్నారన్న సమాచారంతో ఉదయం 6 గంటల నుంచే ఫిలింనగర్‌లోని ఆయన నివాసం వద్ద పోలీసులు మోహరించారు. ఆసుపత్రికి వెళ్లకుండా వెంకటేష్‌ను అడ్డుకున్నారు.
ఈ ఘటనపై బీఆర్‌ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో టిమ్స్ ఆసుపత్రిని సందర్శించేందుకు వెళ్తున్న నాయకుడిని అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు. వెంకటేష్ పర్యటనను ఎందుకు అడ్డుకున్నారనే అంశంపై పోలీసుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
