ప్రభుత్వం ప్రకటించిన మేరకు విద్యుత్ సరఫరా చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ రైతులు గురువారం కారేగాం సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు.
సాగు కోసం లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టామని, విద్యుత్ కోతలతో పంటలు చేతికందకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలను కాపాడుకునేందుకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయం కొనసాగితే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం విద్యుత్ అందించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.
