HomeTelanganaNizamabadటైక్వాండోలో సత్తా చాటిన క్రీడాకారులుజిల్లాస్థాయి పోటీల్లో 100 మందికిపైగా పతకాలు

టైక్వాండోలో సత్తా చాటిన క్రీడాకారులుజిల్లాస్థాయి పోటీల్లో 100 మందికిపైగా పతకాలు

వినాయక్‌నగర్‌లోని బస్వా గార్డెన్‌లో అమేచూర్‌ టైక్వాండో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి టైక్వాండో ఛాంపియన్‌షిప్‌ ఉత్సాహంగా జరిగింది. క్యూరోగి, పూమ్సే విభాగాల్లో వివిధ వయసు, బరువు కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు. యూనివర్సల్‌ టైక్వాండో అకాడమీ, వారియర్స్‌ అకాడమీ, ఛాంపియన్స్‌ టైక్వాండో అకాడమీ, అమేజింగ్‌ టైక్వాండో అకాడమీలకు చెందిన క్రీడాకారులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

100 మందికిపైగా క్రీడాకారులు వివిధ విభాగాల్లో పతకాలు సాధించినట్లు అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి జేసీ మనోజ్‌కుమార్‌ తెలిపారు.ముఖ్య అతిథిగా హాజరైన అసోసియేషన్‌ అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ.. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించి తల్లిదండ్రులకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు.

జిల్లాస్థాయిలో ప్రతిభ చూపిన వారు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. టైక్వాండో సాధనతో శారీరక దృఢత్వంతోపాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఆత్మరక్షణ నైపుణ్యాలు పెంపొందుతాయని తెలిపారు.

పోటీల్లో విజయం సాధించలేకపోయిన క్రీడాకారులు నిరుత్సాహపడకుండా ఓటమిని అనుభవంగా తీసుకుని మరింత పట్టుదలతో సాధన చేయాలని సూచించారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను, శిక్షణ అందిస్తున్న కోచ్‌ జేసీ మనోజ్‌కుమార్‌ను అభినందించారు.

కోచ్‌లు గంగాధర్‌, నాగరాజ్‌, శివకుమార్‌, వినయ్‌లను సన్మానించారు. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లోనూ క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments