ఆర్టీసీ కండాక్టర్ ఆత్మ హత్య చేసుకున్న ఘటన గురువారం అర్ధ రాత్రి నిజామాబాద్ నగరంలోని నందేవడలో చోటు చేసుకుంది.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మాక్లూర్ మండలం లోని కల్లెడి గ్రామానికి చెందిన ఈరావత్రి శ్రీనివాస్(36).
భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.శ్రీనివాస్ వృత్తి రిత్యా ఆర్టీసీ లో కాండాక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.ఈ మేరకు గత కొన్ని రోజులుగా కిడ్నీ లో రాళ్ళు అవ్వడం తో పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
వృతి రీత్యా రాత్రి సమయంలో ఆలస్యం అవుతుందని నగరం లోని నాందేవాడ లో ఓ చిన్న రూం కీరాయి కి తీసుకొని ఉంటాడు.ఈ మేరకు గురువారం రాత్రి కిడ్నీ లో నొప్పి భరించలేక రూమ్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలిపారు.
స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.e మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
