HomeCRIMEగుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి...

గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి…

గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి చెందిన ఘటన నగరంలోని ఆరవ టౌన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.ఆరవ టౌన్ ఎస్ఐ మొగిలయ్య తెలిపిన వివరాల ప్రకారం…

నిజామాబాద్ నగరంలోని అర్సపల్లీ కి చెందిన సర్వ ప్రవీణ్(45).భార్య ఇద్దరు కూతుళ్లు,కుమారుడు ఉన్నట్లు తెలిపారు.మృతుడు వృత్తి రీత్యా కిరణ దుకాణం ఉంది.

ఈ మేరకు శుక్రవారం రాత్రి కిరణ దుకాణ సామాన్లు నిమిత్తం అర్సపల్లీ నుంచి నిజామాబాద్ వెళ్తున్నా క్రమంలో నిజాం కాలని దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీ కొని మురికి కాలువలో పడి మృతి చెందినట్లు తెలిపారు.

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మురికి కాలువలో నుంచి బయటకు తీశారు.మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మొగిలయ్యా పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments