జిల్లాకు చెందిన ఇద్దరు దిగ్గజ నేతలను కీలక పదవులు ఊరిస్తున్నాయి. రేపో మాపో వరిస్తాయని భావించిన పదవులకోసం ఆ నేతలు సుదీర్ఘకాలంగా నిరీక్షిస్తున్నారు.
సామజిక సమీకరణ నేపథ్యంలో అధిష్టానం ఎడతెగని కసరత్తులు చేస్తుండడంతో దిగ్గజ నేతలకు ఎదురుచూపులు తప్పడం లేదు. సరే వదిలేద్దామంటే అవేమి ఆషామాషీ మాషీ పదవులు కావు అందుకే అసహనం తన్నుకొస్తున్న పైకి మాత్రం సంయమనం తో కనిపిస్తున్నారు.
పదవులు దక్కించుకోవడానికి సదురు నేతలు ఇప్పటికే సర్వశక్తులు ఒడ్డారు.ఎట్టకేలకు రేసులోకి మాత్రం వచ్చారు. కానీ తమకు అందలం దక్కుతుందా లేదా అనేది ఆ నేతలిద్దరికి ఉత్కంఠ గా మారింది. కాంగ్రెస్ పార్టీ రాష్త్రం లో అధికారంలోకి రావడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆ పార్టీ నేతల్లో పదవుల పందేరం మొదలయ్యింది.
కీలక పదవుల కోసం దిగ్గజ నేతలు హోరాహోరీ పోటీపడుతున్నారు. పీసీసీ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ పీసీసీ పీఠం మీద ….ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మంత్రి పదవీ మీద గంపెడు ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ నుంచి నలుగురు ఎమ్మెల్యే గెలిచినా ముగ్గురు మొదటి సారి గెలిచిన వారే కావడంతో సుదర్శన్ రెడ్డి కి మొదటి దఫాలోనే మంత్రి పదవీ ఖాయమనుకున్నారు.
కానీ నిరాశే ఎదురైంది. రేవంత్ క్యాబినెట్ లో మొదటి సారిగా జిల్లాకు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ఈసారి మంత్రి వర్గ విస్తరణ లో జిల్లాకు అవకాశం ఇవ్వడం అనివార్యంగా భావిస్తున్న రేవంత్ రెడ్డి ఈపాటికే సుదర్శన్ రెడ్డి పేరు ను అధిష్టానంకు ప్రతిపాదించారు.
అదీగాక ఆయన కు హోం శాఖ రాబోతుందంటూ సన్నిహితులు ఊదరగొడుతున్నారు. నెల 4 న మంత్రిగా ప్రమాణం చేయబోతున్నానని ఆయనకూడా ధీమా గా చెప్పుకున్నారు. నిజానికి ఆయన క్యాబినెట్ లో చేరడానికి నెలతరబడిగా ఎదురు చూస్తున్నారు.
గతంలో మంత్రి గా పనిచేసిన అనుభవం ఉన్నాసరే ఆయన్ను ఈసారి రేవంత్ క్యాబినెట్ లో తీసుకునే విషయంలో అధిష్ఠానం జాప్యం చేయడం ఎవరికి అంతు చిక్కడం లేదు.
ఆషాడ మాసం లోపే తాను మంత్రి అవుతానని భావించిన సుదర్శన్ రెడ్డి మంత్రి పదవీ కోసం ఇప్పుడు శ్రావణ మాసం దాక వేచిఉండక తప్పని పరిస్థితి. మరో వైపు ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ పరిస్థితి కూడ ఇలాగే ఉంది.
పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ గా ఉన్న ఆయన్ను కూడా పీసీసీ పీఠం ఇలాగే ఊరిస్తుంది. విద్యార్థి దిశ నుంచే కాంగ్రెస్ లో పనిచేస్తున్న మహేష్ గత ఎన్నికల్లో ఎమ్మెల్యే కూడా త్యాగం చేసారు.
వర్కింగ్ ప్రసిడెంట్ గా పార్టీ సంస్థాగత వ్యవహారాలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించి ఢిల్లీ పెద్దలతో శబాష్ అనిపించుకున్నారు.టికెట్ త్యాగం చేయాలని అధిష్ఠానం చెప్పినప్పుడే పార్టీలో పదోన్నతి సంకేతాలు ఇచ్చారు .
ఎంపీ ఎన్నికలకు ముందే పీసీసీ మార్చాలని అధిష్టానం బావించింది. ఎలాగో రేవంత్ రెడ్డి పదవీకాలం పూర్తీ అయింది. ఇప్పుడు కొత్త పీసీసీ నియామకం అనివార్యం అయింది.దీనితో మహేష్ కే పీసీసీ పగ్గాలు ఇవ్వడం లాంఛనమే అనుకున్నారు.
ఆషాడం లోపే పీసీసీ ప్రకటిస్తారని భావించి దాదాపు పది రోజులు మహేష్ ఢిల్లీలో నే మకాం వేయాల్సి వచ్చింది. కానీ అధిష్టానం సమీకరణాలు ఎంతకు కొలిక్కి రాలేదు ఈలోపు ఆషాడం కూడా వచ్చేసింది. ఇంకేముంది పదవీ కోసం శ్రావణమాసం దాక వేచి చూడక తప్పని పరిస్థితి మహేష్ ది.