యంబిబియస్ మొదటి సంవత్సరం అడ్మిషన్ లకు సంబంధించి కౌన్సిలింగ్ ను వాయిదా వేశారు. శనివారం కౌన్సిలింగ్ పక్రియ మొదలవ్వాల్సి వుండగా సోమవారం సుప్రీం కోర్టు లో విచారణ జరగనుంది.
ఈ నేపథ్యంలో ఎన్టీఏ నీట్ కౌన్సలింగ్ ను వాయిదా వేసింది. సుప్రీం కోర్టు నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ఎన్టీఏ చెప్తుంది.
నీట్ పరీక్షా పత్రం లీక్ అయిందని అందుకే వెంటనే రద్దు చేసి మరోసారి నీట్ నిర్వహించాలని దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి.
