HomeCRIMEమహిళా ప్రాణాలు కాపాడిన ఎస్ఐ...

మహిళా ప్రాణాలు కాపాడిన ఎస్ఐ…

రైలు కింద పడి ఆత్మహత్యా యత్నానికి పాల్పడినా ఓ మహిళను రెండవ టౌన్ ఎస్ఐ రామ్ కాపాడారు.

వివరల్లోకి వెళ్లితే…నిజామాబాద్ నగరంలోని హైమద్ పుర కాలానికి చెందిన ఓ వివాహిత కుటుంబ కలహాలతో సోమవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది.

దీంతో భర్త రెండవ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ వివాహిత ఫోన్ జీపీఎస్ లొకేషన్ ఆధారంగా నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో సమీపంలో ఉన్నట్లు గుర్తించారు.

పోలీసులు అక్కడికి చేరుకుని గాలించగా సదరు వివాహిత రైలు కు ఎదురుగా వెళ్తున్నట్లు గమనించారు. హుటాహుటిన వెళ్లి మహిళను రక్షించినట్లు తెలిపారు.

ఎస్ఐ రామ్ బాధిత మహిళకు కౌన్సెలింగ్ నిర్వహించి పంపించారు. సదరు ఎస్ఐ రామ్ విహావిత ప్రాణాలు కాపాడటం పట్ల పలువురు ప్రశంశలు కురిపిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments