నిజామాబాద్ నగరంలోని రైల్వే స్టేషన్లో నల్లబెల్లంను పట్టుకున్నట్లు ఆర్పిఎఫ్ రైల్వే పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే… నిజామాబాద్ పోస్ట్‌లో ఆపరేషన్ సటార్క్లో భాగంగా రైల్వే పోలీసులు ప్రత్యేక బృందాలతో పాటు ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా మూడు నల్లబెల్లం సంచులు,
7పటికలను స్వాధీనం చేసుకున్నట్లు ఆర్పీఎఫ్ సీఐ సుబ్బారెడ్డి తెలిపారు. 120 కేజీల నల్లబెల్లం విలువ సుమారు రూ.9600 ఉంటుందని అలాగే 250 కేజీల బరువు గల పటిక విలువ రూ. 10వేలు ఉంటుందని తెలిపారు.
