Wednesday, April 29, 2026
HomeCRIMEగుర్తు తెలియని వాహనం ఢీ యువకుడు మృతి ..

గుర్తు తెలియని వాహనం ఢీ యువకుడు మృతి ..

గుర్తు తెలియని వాహనం ఢీ యువకుడు మృతి చెందిన ఘటన ఇందల్వాయి మండలంలో చోటు చేసుకుంది.ఎస్ఐ మనోజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..

ప్రకాశం జిల్లా కి చెందిన చిన్నగరి కొండయ్య(38)గత కొన్ని నెలలుగా ఇందల్వాయి మండలంలోని గన్నవరం గ్రామంలో మేస్త్రి పనులు చేస్తున్నారు.

ఈమేరకు సోమవారం రాత్రి ఇందల్వాయి నుంచి గన్నవరం వైపుగా నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో 44జాతీయ రహదారి పై గుర్తు తెలియని వాహనం వెనకనుంచి ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

అటు వైపుగా వెళ్తున్న వ్యక్తులు గమనించి స్థానిక ఇందల్వాయి పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మనోజ్ కుమార్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!