నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నిరస్థాయులకు కొరకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు.
శనివారం రాత్రి నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలోని ఎక్కడ కూడా ఎలాంటి ఆధారం లేని రోడ్ల పై జీవనం గడిపే నిరస్తాయులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిజామాబాద్ నగరంలోని బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ పరిధిలో జిల్లా కేంద్రంలో మూడు నిరస్తాయుల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఎలాంటి ఆధారం లేని రోడ్ల పై జీవనం గడిపే నిరస్తాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి సూచించారు.
ఈ కార్యక్రమంలో ఒకటవ టౌన్ సిఐ విజయ్ బాబు,ట్రాఫిక్ సిఐ వెంకట నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
