చేపల వలలో చిక్కుకుని వ్యక్తి మృతి చెందిన ఘటన నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది.ఎస్ఐ హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం..
నందిపేట్ మండలంలోని మారంపల్లి గ్రామానికి చెందిన సిరిగిరి సాయన్న(45). సోమవారం మధ్యాహ్నం చేపలు పట్టడానికి మారంపల్లి గ్రామ శివారులోని ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ లో చేపలు పట్టడానికి వెళ్ళాడని పేర్కొన్నారు.
చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు కాళ్ళు,చేతులు చేపల వలలో చిక్కుకుని నీటిలో మునిగి మృతి చెందినట్లు తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
పోస్టు మార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హరిబాబు పేర్కొన్నారు.
