నూతనంగా నియామకమైన బిల్ కలెక్టర్లకు అలాగే రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు మున్సిపల్ సంచాలక కార్యాలయంలో ప్రాథమిక శిక్షణ ను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ మకరందం పేర్కొన్నారు.
ఈ శిక్షణను హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ విధానంలో కమిషనర్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఇంటి పన్నుల విధింపు వసూళ్ల కోసం రెవెన్యూ విభాగంలో నియామకమైన అధికారులకు శిక్షణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణను అందించినట్లు తెలిపారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో సంయుక్త సంచాలకులు ఫల్గున్,ఇసాక్, నగరపాలక సంస్థ రెవెన్యూ ఆఫీసర్ నజీర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు.
