పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో అధికార పార్టీలో నేతలు నామినేటెడ్ పదవుల కోసం పందేరం ఆసక్తి గా మారింది. అర్బన్ సెగ్మెంట్ లో ఖాళీగా పదవుల భర్తీ పక్రియ రేపో మాపో మొదలవ్వనుంది.
ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి పదవుల పంచాయితీ కొలిక్కి తెచ్చారు. షబ్బీర్ సుదర్శన్ రెడ్డి లతో పాటు పలువురు అర్బన్ నేతలు ఆదివారం సీఎం ను కలిశారు.
ఈ సందర్భంగా ఎవరెవరికి ఏ పోస్టు ఇవ్వాలనేది ఖరారు చేసారు. కీలక మైన నుడా ఛైర్మెన్ గా అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు కు లైన్ క్లియర్ అయ్యింది. రెండు మూడు రోజుల్లో నియమక ఉత్తర్వ్యూలు వచ్చే అవకాశం ఉంది.
అలాగే రూరల్ సెగ్మెంట్ కు చెందిన శేఖర్ గౌడ్ కు మార్కెట్ కమిటీ ఛైర్మెన్ ఇవ్వడానికి సూచన ప్రాయంగా అంగీకారం కుదిరింది.శేఖర్ కు మార్కెట్ కమిటి ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ సిఫారస్ చేశారు.
అందుకు సీఎం రేవంత్ ఓకే అన్నారని సమాచారం. కానీ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ముప్పు గంగారెడ్డి కిఇవ్వాలని పట్టు బడుతున్నారు.
అలాగే రత్నాకర్ కు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ లో సర్దుబాటు చేయడానికి సీఎం భరోసా ఇచ్చారని సమాచారం. మొత్తానికి అర్బన్ లో నామినేటెడ్ పదవుల పంచాయితీ కొలిక్కి వచ్చింది.
