తోలి దశ తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు ఐలమ్మ వర్ధంతి ని బిసి విద్యార్థి సంఘాలు మంగళవారం నిర్వహించాయి.
వినాయక్ నగర్ లో ఆమె విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు ఆమె ప్రదర్శించిన దైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికి ఎంతో స్పూర్ధిదాయకం.
భూమి కోసం , భుక్తి కోసం, వెట్టి చాకిరి వివిముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిచెప్పారని వారు కొనియాడారు .
ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల వర్కింగ్ ప్రెసిడెంట్ దత్తు, జిల్లా నాయకుడు నిఖిల్ గౌడ్, డివిజన్ అద్యక్షులు విజయ్, మండల అద్యక్షులు రాఘవ గోవర్ధన్ , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
