తన పొలం లో వెళ్తుండగా వేలాడుతూ ట్రన్స్ ఫార్మర్ వైరు తగిలి ఓ రైతు మృత్యువాత పడిన ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుర్జాల్ లో జరిగింది.
గ్రామానికి చెందిన దేవేందర్ అలియాస్ రాజు (35) బుధవారం ఉదయం తన సొంత పొలంలో పంటకు పురుగుల మందు చల్లడానికి వెళ్లారు.
ఆయన పొలం వెళ్లే దారిలోనే ట్రన్స్ ఫార్మర్ కు ఉన్న వైరు ఊడిపోవడంతో దాన్ని కట్టెతో సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు చేతులకు తగిలి కరెంట్ షాక్ కొట్టేసింది దీనితో రాజు అక్కడికక్కడే మృతి చెందాడనిగాంధారి , ఎస్సై ఆంజనేయులు తెలిపారు.
మృతుని భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. మృతునికి ఇద్దరు కూతుర్లు,ఒ క కుమారుడు ఉన్నాడని పంచనామా నిమిత్తం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపామని ఎస్సై ఆంజనేయులు తెలిపారు.
