ఇద్దరు న్యాయ వాదుల మధ్య ఘర్షణ జరిగింది. సీనియర్ న్యాయ వాదీ మీద సస్పెండ్ అయిన ఓ న్యాయ వాదీ చేయి చేసుకున్నట్లు సమాచారం.బుధవారం ఉదయం నిజామాబాద్ కోర్టు లో ఒకటో అంతస్థులో వరండాలో లో ఈ ఘటన జరిగింది.
ఈ మేరకు బాధిత న్యాయ వాదీ ఒకటో టౌన్ పోలీసులకు పిర్యాదు చేసారు. కోర్టు మూడో అంతస్థులో ఉన్న న్యాయ వాదీ కొందరు యువకులు వచ్చి మరో న్యాయ వాదీ కోసం వాకబు చేశారు. అతను కోర్టు లో కేసు వాదించడానికి లేదని బార్ కౌన్సిల్ నుంచి సస్పెండ్ అయ్యారని చెప్పారు.
అప్పుడే వచ్చిన సదురు బహిష్కృత న్యాయ వాది ఆగ్రహం తో సీనియర్ న్యాయ వాదీ మీద చేయి చేసుకున్నారు. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. పలువురు న్యాయ వాదులు జోక్యం చేసుకొని ఇద్దరికీ సర్ది చెప్పారు.
కానీ సీనియర్ న్యాయ వాదీ గదవ భాగం లో గాయం అయింది. దీనితో ఆయన ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకటో టౌన్ పోలీసులకు పిర్యాదు చేసారు.
