HomeLaw and Orderప్రశాంతంగా పర్వదినాలు .....సహకరించిన అందరికి ధన్యవాదాలు ......సీపీ కల్మేశ్వర్..

ప్రశాంతంగా పర్వదినాలు …..సహకరించిన అందరికి ధన్యవాదాలు ……సీపీ కల్మేశ్వర్..

గణేష్ విగ్రహ ప్రతిష్ఠాపన, నిమజ్జనం లతో పాటు మిలాద్ ఉన్ నబీ పండుగలప్రశాంతంగా జరిగేలా సహకరించిన అందరికి పొలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ధన్యవాదాలు తెలిపారు

నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో గణేష్ విగ్రహ ప్రతిష్టాపన నవరాత్రి ఉత్సవాలు మరియు మిలాద్ ఉన్ నబీ పండుగ ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవడంఫై ఆయన హర్షం వ్యక్తం చేశారు నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో దాదాపు 6000 గణేష్ విగ్రహాలుప్రతిష్టించారని .

9 మరియు 11 రోజుల పాటు మండపాలలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి నిమజ్జనం చేయడం చేసారని గణేష్ ఉత్సవాలు జరుగుతున్న క్రమంలోనే 16న మహ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకల సందర్బంగా నిజామాబాద్ కమీషనరేటు అంత 20 ప్రదేశాలలో ఉత్సవ వేడుకల ర్యాలీలు కూడా నిర్వహించారని ఆయన గుర్తు చేశారు .

అన్ని మతాల ప్రజలు స్వచ్చందంగా సహకరించుకొని జయప్రదం చేశారన్నారు . నిమజ్జనం కోసం ప్రత్యేకంగా బాసర బ్రిడ్జి పద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సంవత్సరం నందిపేట మండలంలోని ఉమ్మోడ గోదావరి బ్రిడ్జి వద్ద భారీ గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం వల్ల నిమజ్జనం మరింత సులువుగా జరిగిందన్నారు .

ఇవి కాకుండా మిగితా చాలా ప్రదేశాలలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి అన్ని వేడుకలు ప్రశాంత వాతావరణంలో గణేష్ విగ్రహాల ప్రతీష్టాపన నిమజ్జనంతో పాటు మిలాద్ ఉన్ నబీ వేడుకలు అన్నింటికి సార్వజనిక్ గణేష్ మండలి.

మజీద్ కమిటీలు, విగ్రహ గణేష్ కమిటీలు మరియు అన్ని మతాల ప్రజలు, ప్రతీ ఒక్కరు పోలీస్ శాఖకు సహకరించారని అదే విధంగా వివిధ శాఖల అధికారులు / సిబ్బంది ప్రత్యేకంగా రెవెన్యూ శాఖ గ్రామ పంచాయతి.

మున్సిపాలటి, అబ్కారీ శాఖ ఫైర్ సర్వీస్ మరియు ఎన్.సి.సి మరియు గజ ఈతగాళ్లు అందరూ వారి సేవలను అందించారని అందరికి ధన్యవాదాలన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments