Saturday, May 2, 2026
HomeHEALTHజి జి హెచ్ నిజామాబాద్ లో సింగిల్ డోనర్ ప్లేట్‌లెట్స్ (ఎస్‌డిపి) యంత్రం ఆవిష్కరణ...

జి జి హెచ్ నిజామాబాద్ లో సింగిల్ డోనర్ ప్లేట్‌లెట్స్ (ఎస్‌డిపి) యంత్రం ఆవిష్కరణ…

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సింగిల్ డోనర్ ప్లేట్‌లెట్స్ (ఎస్‌డిపి) యంత్రం సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ ఆవిష్కరించారు.

SDP మెషిన్‌ను ఏర్పాటు చేయడంతో, సింగిల్ డోనర్ ప్లేట్‌లెట్స్ (ఎస్‌డిపి) పద్ధతిని ఉపయోగించి రోగి అవసరాన్ని బట్టి ఒకే దాత నుండి ప్లేట్‌లెట్లను సేకరించడం సులభంగా సాధ్యమవుతుందని సూపరింటెండెంట్ డా. ప్రతిమ రాజ్ తెలిపారు.

మరియు ఈ యంత్రం ఖరీదు సుమారు 40 లక్షల వరకు ఉంటుందని, ఒక సారి చేయడానికి ఉపయోగించే పరికరాలు సుమారు 15 వేల వరకు అవుతుందని తెలిపారు.ఈ ప్రక్రియలో ప్లేట్‌లెట్స్ ఒక గంటలో రక్తం నుండి విడుదలవుతాయి.

దాత 72 గంటల తర్వాత మళ్లీ ప్లేట్‌లెట్లను దానం చేయవచ్చు. ఈ పద్ధతిని ఉపయోగించే రోగిలో ప్లేట్‌లెట్ల సంఖ్య 50,000 నుండి 60,000 వరకు పెరుగుతుంది.

RDP టెక్నిక్‌లో, గ్రహీతకు బ్లడ్ బ్యాంక్ నుండి అతని/ఆమె మ్యాచింగ్ గ్రూప్ యొక్క ప్లేట్‌లెట్స్ ఇవ్వబడతాయి. కాని SDP ద్వారా ఏదైనా బ్లడ్ గ్రూపు దాత నుండి రక్తం దానం చేయబడుతుంది.

ఈ కార్యక్రమం లో డాక్టర్ ఇమ్రాన్ అలీ పాథాలజీ, విభాగాధిపతి, చందు బ్లడ్ బ్యాంక్ ఇంచార్జి మరియూ ఇతర వైద్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!