నగరంలోని బ్రాహ్మణ కాలోనికి చెందిన షేక్ మజీద్ ని హత్య చేసిన కేసులో ఇద్దరు వ్యక్తులకు జీవిత కారాగార శిక్ష విధిస్తు నిజామాబాద్ సెషన్స్ జడ్జి సునీత కుంచాల శుక్రవారం సంచలన తీర్పు వెలువరించారు.
వివరాల్లోకి వెళ్లితే ఎల్లమ్మ గుట్టకు చెందిన షేక్ జుబిర్ భార్యను షేక్ మజీద్ తరుచూ పోన్ చేస్తు వేదించేవాడు.
ఇతని వేధింపులు భరించలేక తన చిన్న నాన్న అయిన ఎల్లమ్మ గుట్ట వాసి షేక్ అతీక్ నుఅటోలో వెంట పెట్టుకుని 29 దిశంబర్ 2021 న నాగారం లోని బహ్మణ కాలోనికి వెళ్లి మజీద్ ను అటోలో తీసుకుని డిచ్ పల్లి మండల శివారులోని బర్ది పూర్ గ్రామ కు వెళ్లి కళ్ళు తాగిన మత్తులో ముగ్గురు ఆటోలో తిరుగు ప్రయాణంలోషేక్ జుబిర్,షేక్ అతీక్ లు అసభ్య కరంగా మాట్లాడం భరించలేక మజీద్ ను కత్తితో పొడిచి హత్య చేశారు.
బార్డిపూర్ గ్రామ శివారులో ని కాలువలో పడవేశారనే నేర అభియోగాలు కోర్టు న్యాయ విచారణలో రుజువు కావడంతో ముద్దాయిలు ఇద్దరికి హత్య కేసులో జీవిత ఖైదు రెండు వేల రూపాయల జరిమాన, సాక్ష్యాలను లేకుండా చేయడం అనే నేరం ప్రకారం ఏడేళ్ల కఠిన జైలుశిక్ష విధిస్తు సెషన్స్ జడ్జి సునీత తీర్పు చెప్పారు.
