మృతురలిని 20 రోజులు ఇంట్లో చిత్రహింసలు…అనుమానంతో భార్యను అతికిరాతకంగా ఓ భర్త తన స్నేహితుడితో కలిసి హత్య చేసిన ఘటన కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.స్థానికుల సమాచారం మేరకు..
పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డ్ కాలానికి చెందిన రంగా రాణి(30). గంగాధర్ గౌడ్ తో 9 సంవత్సరాల క్రితం వివాహమైంది.
వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గత కొన్ని రోజుల క్రితం గంగాధర్ గౌడ్ కు వైజాగ్ కు చెందిన బాలాజితో స్నేహం కుదిరింది.
వీరు ఇద్దరు కలిసి గంగాధర్ గౌడ్ భార్య అయిన రాణి నీ 20 రోజులపాటు అతి కిరాతకంగా ఇంట్లో బంధించి హింసించి పురుగుల మందు తగించినట్లు తెలిపారు.
ఈమేరకు రాణి అక్కడ నుంచి తపించుకొని తల్లిదండ్రుల వద్దకు చేరుకుని నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.
పరిస్థితి విషమంగా ఉందంటతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తండ్రి రాజేశ్వర్ గౌడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
