Tuesday, April 28, 2026
HomeCRIMEరౌడీ షీటర్ కారు పట్టేసిన ట్రాఫిక్ సిబ్బందిని అభినందించిన పోలీస్ కమీషనర్

రౌడీ షీటర్ కారు పట్టేసిన ట్రాఫిక్ సిబ్బందిని అభినందించిన పోలీస్ కమీషనర్

ట్రాఫిక్ విధుల్లో ఉన్నాసరే అసాంఘిక శక్తుల అటకట్టించిన కానిస్టేబుల్ ను కమిషనర్ అభినందించారు.

ఈ నెల 23 సాయంత్రం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైపాస్ చౌరస్తా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద డిజైర్ కారు టి.జి16 1413 గల నెంబర్ గల వాహనం రాంగ్ రూట్ లో సిగ్నల్ జంప్ చేసి వెళ్తుంటే అక్కడే విదులు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎమ్. అబ్బులు చొరవ తీసుకోని కారు ఆపి డోర్ ఒపెన్ చేసి చూడగా అందులో కత్తులు, తల్వార్ లు ఉండగా ఇంతలోనే డ్రైవర్ పారిపోయాడని

ఆ కారులో గల ఇద్దరు అనుమానితులను కారును నిజామాబాద్ రూరల్ పోలీసులకు అప్పగించారు. ట్రాఫిక్ విధుల్లో ఉండి లా అండ్ ఆర్డర్ విధుల్లో చొరవ చూపడం ఫై పోలీస్ కమీషనర్ శ్రీ కల్మేశ్వర్ సింగెనవార్, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎమ్. అబ్బులు ను శాలువతో సత్కరించి రివార్డు ఇచ్చి అభినందించారు .

ఆయన మాట్లాడుతూ సిబ్బంది ఎంతో సమయస్ఫూర్తితో మరియు చాకచక్యంగా విధులు నిర్వహించడం ఎంతో అభినందనీయమని, మిగితా సిబ్బంది అందరూ వీరిని స్ఫూర్తీగా తీసుకోవాలన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!