Sunday, April 26, 2026
HomeTelanganaHyderabadతెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో దొంగతనం ....కోల్ కత్తాపట్టుబడిన దొంగలు ...

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో దొంగతనం ….కోల్ కత్తాపట్టుబడిన దొంగలు …

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరిగిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది ఈ విషయంచోరీ కి పాల్పడిన వారు పట్టుబడిన తరవాతే వెలుగులోకి వచ్చింది .

పశ్చిమ్‌బెంగాల్‌ లోని ఖరగ్‌పూర్‌ రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫాంపై అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరి ని జీఆర్పీ పోలీసుల విచారించే క్రమంలోనే ఈ చోరీ ఉదంతం వెలుగులోకి వచ్చింది .

వారిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా… తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో దొంగతనం చేసినట్లుగా అంగీకరించారు నిందితులు బిహార్‌కు చెందిన రోషన్‌కుమార్ మండల్‌, ఉదయ్‌కుమార్‌ ఠాకూర్‌గా పోలీసులు గుర్తించారు.

వారి వద్ద బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నారు . వారు ఈపాటికే తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెల్సింది ఈ మేరకు ఓపోలీసు బృందం సైతం కోల్ కత్తా వెళ్ళింది ..

నిందితుల నుంచి రూ.2.2 లక్షల నగదు, 100 గ్రా. బంగారం, విదేశీ కరెన్సీ స్వాధీనంచేసుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!