రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో సెంట్రీ డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మ హత్య కు పాల్పడ్డాడు.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండలం .
మంచాల గ్రామానికి చెందిన దూసరి బాలకృష్ణ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఉన్నారు . కొంతకాలంగా కలెక్టరేట్లో డ్యూటీ చేస్తున్నాడు.
అయితే శనివారం తెల్లవారు జామున బాత్ రూమ్ లోకి వెళ్లి తన వద్ద ఉండే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహం ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
